బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (19:48 IST)

ఒమిక్రాన్‌కు చెక్ పెట్టే ఔషధం : బ్రిటన్‌లో ఆశాదీపంలా ఆ మందు...

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా తాజా వేరియంట్ ఒమిక్రాన్. ఇప్పటికే ఆఫ్రికా దేశాలతో పలు అగ్రరాజ్యాల్లో ఈ కేసులు బయటపడుతున్నాయి. గురువారం భారత్‌లో కూడా నాలుగు కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ ఒమిక్రాన్‌కు చెక్ పెట్టే ఔషధాన్ని గుర్తించింది. ఆ మందు పేరు సోట్రోవిమాబ్. ఈ మందు ఇపుడు బ్రిటన్‌లో ఓ ఆశాదీపంలా మారింది. ఈ మందు ఒమిక్రాన్ సోకిన రోగుల్లో ముప్పును దాదాపు 80 శాతం మేరకు తగ్గిస్తుందని తేలింది.
 
మరోవైపు, ఒమిక్రాన్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదేపదే హెచ్చరిస్తుంది. అంతేకాకుండా, ఈ వైరస్ ఎంత ప్రమాదకారో ఇప్పుడే చెప్పలేమని తేల్చి చెప్పింది. అయితే, ఒమిక్రాన్ పట్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. 
 
మరోవైపు, ఒమిక్రాన్‌కు తగిన మందును కనిపెట్టినట్టు బ్రిటన్ ప్రకటించింది. ఈ మందు పేరు సోట్రోవిమాబ్ అని, ఫార్మా దిగ్గజం గ్లాక్సో స్మిత్ క్లైన్ సంస్థ ఈ మందును ఉత్పత్తి చేస్తుందని తెలిపుతూ, ఈ మందుకు బ్రిటన్ ఔషధ నియంత్రణ ఆగమేఘాలపై ఆమోదముద్ర వేసింది. 
 
ఒమిక్రాన్ వైరస్ సోకినవారికి ఓ ఔషధాన్ని ఇంజెక్షన్‌‍తో యాంటీబాడీ చికిత్స వారిలో మరణించే ప్రమాదం 79 శాతం మేరకు తగ్గుతుందని పేర్కొంది. ఈ మందును నరాల ద్వారా శరీరంలోకి ఎక్కించగా, కరోనా వైరస్ మానవ కణాల్లో ప్రవేశించడాన్ని సమర్థంగా  అడ్డుకున్నట్టు పరిశోధనల్లో వెల్లడైందని పేర్కొంది.