సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 17 జులై 2021 (10:56 IST)

టీటీడీ ఛైర్మ‌న్‌గా మ‌ళ్లీ వై.వీ.సుబ్బారెడ్డే!

టీటీడీ ఛైర్మన్‌గా మ‌ళ్ళీ వైవీ సుబ్బారెడ్డికే ఛాన్స్ వ‌చ్చింది. కాదు కాదంటూనే, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చివ‌రికి సుబ్బారెడ్డి ప‌ద‌వీకాలం పొడిగింపున‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి గడువు ఈ నెల 21తో ముగుస్తోంది. దీంతో కొత్త పాలకమండలి ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది.

మరోసారి వైవీ సుబ్బారెడ్డి పదవని జగన్ రెన్యువల్ చేస్తారా? లేదా కొత్త వారికి పదవి అప్పగిస్తారా? అని ఇంత‌కాలం ఉత్కంఠ నెల‌కొంది. టీటీడీ ఛైర్మన్‌గా అనేక మంది పేర్లు వినిపించ‌డంతో, వైవీకి వేరే ప‌ద‌వి అప్పగిస్తారనే చర్చ కూడా పార్టీలో నడిచింది. కానీ, చివ‌రికి మరోసారి ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికే ఆవకాశం ఇచ్చారు. 
 
నేడు టీటీడీ పాలకమండలి సమావేశం కాబోతున్న త‌రుణంలో ఆయ‌న ఎక్స్‌టెన్ష‌న్ వార్త రావ‌డంతో...అందిరిలో టెన్ష‌న్ తొల‌గింది. రేపు స్వామివారి ఆలయంలో భోగశ్రీనివాసమూర్తికి ఏకాంతంగా సహస్రకలశాభిషేకాన్ని అర్చకులు నిర్వహించనున్నారు.

22వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జేష్ఠాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. 24వ తేదీన వర్చువల్ ఆర్జిత సేవలను కూడా టీటీడీ రద్దు చేసింది. నేడు జరగనున్న చివరి పాలకమండలి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్నదీ ఆసక్తికరంగా మారింది.