ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2018-19
Written By selvi
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2018 (11:44 IST)

బడ్జెట్‌లో కీలకాంశాలు.. గ్రామీణ వ్యవసాయ మార్కెట్లకు రూ.2వేల కోట్లు

వ్యవసాయం దేసంలో ప్రధాన రంగం కావడంతో క్లస్టర్ విధానంలో భాగంగా వ్యవసాయాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ప్రకటించారు. ఇందులో భాగంగా గ్రామీణ వ్యవసా

వ్యవసాయం దేసంలో ప్రధాన రంగం కావడంతో క్లస్టర్ విధానంలో భాగంగా వ్యవసాయాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ప్రకటించారు. ఇందులో భాగంగా గ్రామీణ వ్యవసాయ మార్కెట్లకు రూ.2000కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు.

సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం ఇస్తామని తెలిపారు. రాజకీయాలతో ఎలాంటి ప్రమేయం లేకుండా పనిచేస్తున్నామని.. వ్యవసాయం, మౌలిక సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణలకు ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేస్తామని చెప్పుకొచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం ఎగుమతులు 15శాతం పెరిగాయన్నారు. 
 
ప‌న్నుల విధానం జీఎస్‌టీలో సుల‌భ‌త‌ర‌మైందని ప్రకటించారు. పెద్ద‌నోట్ల ర‌ద్దులో భారీగా ధ‌నం వినియోగంలోకి వ‌చ్చింది. సంస్థాగ‌త సంస్క‌ర‌ణ‌ల్లో పేద‌ల‌కు ల‌బ్ధి చేకూరుతుందని వెల్లడించారు.

సులభతర వాణిజ్యం విధానంలో ఆర్థికవృద్ధి వేగంగా జరుగుతుంది. సహజ వనరులను పారదర్శక విధానంలో కేటాయిస్తున్నామని.. నిజమైన లబ్ధిదారులకు సబ్సిడీలు అందిస్తున్నామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. 2022కు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
 
కేంద్ర బడ్జెట్‌లో భాగంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రైతులకు వరాల జల్లు కురించారు. ఉత్పత్తి ధరకంటే 1.5 రెట్లు అధికంగా కనీస మద్దతు ధర చెల్లించనున్నట్టు జైట్లీ ప్రకటించారు. వ్యవసాయ ఉత్పత్తులకు మరింత ఊతమిచ్చేందుకు హరిత ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ప్రభుత్వం ఇప్పుడు నిరుపేదల జీవన పరిస్థితులను మెరుగుపర్చడంపై దృష్టిపెట్టినట్టు ప్రకటించారు.
 
* ఉజ్వల యోజన కింద 8 కోట్ల మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు 
* వెదురు ఉత్పత్తికి రూ.1290 కోట్లు
* వ్యవసాయ రుణాలు రూ. 11 లక్షల కోట్లకు పెంపు 
* వితంతువులు, అనాథలు, దివ్యాంగుల సామాజిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.