బుధవారం, 27 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2022 (21:47 IST)

దీపావళి వాస్తు చిట్కాలు.. ఉత్తరాన అందంగా వుండాలట.. (video)

Diwali
దీపావళికి ఇంటిల్లిపాదిని శుభ్రం చేసుకోవాలి. పనికిరాని వస్తువులు ఇంటి నుంచి తొలగించాలి. ఇంటిలో విరిగిన వస్తువులు, అద్దాలు, ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్లు, బొమ్మలు వుండకుండా చూసుకోవాలి. 
 
దీపావళి రోజున ఇల్లు దీపాలతో వెలిగిపోవాలి. ఉపయోగంలో లేని అన్ని విరిగిన వస్తువులను వదిలించుకోవాలి. ముఖ్యంగా ఇంటికి ఉత్తరంగా వుండే కుబేర స్థానాన్ని శుద్ది చేసుకోండి. ఇంటికి ఉత్తరం, ఈశాన్య దిశలను చక్కగా, శుభ్రంగా, అద్భుతంగా, ఆకర్షణీయంగా, అందంగా వుంచండి. 
 
దీనిని బ్రహ్మస్థానంగా పేర్కొంటారు. ఇంటి ఉత్తర దిశలో ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా వుండేలా శుభ్రంగా వుంచుకోవాలి. బరువు ఈ దిశల్లో వుంచకూడదు. ఈ ప్రాంతంలో ఎలాంటి వాస్తు దోషాలైనా ఉంటే ఆదాయాన్ని కోల్పోతాయి. ఉత్తరాన నీటి ట్యాంక్, తోట లేదా ప్రధాన ద్వారం కలిగి ఉండవచ్చు. 
 
అలాగే దీపావళి రోజున ఇంటిని లైట్లు, పువ్వులు, ముగ్గులతో అలంకరించుకోవాలి. ఇది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుంది. ఇలా చేస్తే ఆ ఇంట లక్ష్మీదేవి స్థిరంగా కొలువైవుంటుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు.