శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 సెప్టెంబరు 2020 (15:06 IST)

వర్కింగ్ ఉమెన్.. చిరాకు పడకుండా వుండాలంటే.. ఈ టిప్స్ పాటించాల్సిందే..

ఉద్యోగాలు వెళ్లే మహిళలు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కరోనా కాలంలో ప్రస్తుతం మహిళలు ఇంటిపట్టున వుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కొందరు అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆఫీసులకు వెళ్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని న్యూట్రీషియన్లు అంటున్నారు. 
 
సాధారణంగా ఇంటి పని చేసుకుని.. ఆఫీసుకు వెళ్తుంటారు చాలామంది. ఆఫీస్‌లో రోజూ ఏడెనిమిది గంటలు పని చేస్తారు. సాయంత్రం ఇంటికి రాగానే అలసటతో చిరాకు పడుతుంటారు. అలా చిరాకు పడకుండా వుండాలంటే.. మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఉద్యోగం, ఇంటి పనులతో సతమతం అవుతున్న మహిళలు.. రోజూ అరగంట నడవండి. అలాగే సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్‌లకు లిఫ్ట్ ఎక్కే బదులు కాలినడకన మెట్లు ఎక్కండి. శరీరానికి వ్యాయామం అందుతుంది.
 
కంప్యూటర్ ముందు కూర్చొని ఉద్యోగం చేసే మహిళల్లో ఎక్కువగా చేతివేళ్ల నొప్పితో బాధపడతారు. అలాంటి సమస్య ఉన్నవారు జుట్టుకు ఉన్న రబ్బరుబ్యాండ్ తీసుకోవాలి. కుడి, ఎడమ చేతివేళ్లను దగ్గరకు చేర్చి బ్యాండ్ వేయాలి. బ్యాండ్‌ను సాగదీస్తూ వేళ్లను దూరంగా దగ్గరకు జరపాలి. ఇలా 10-15 నిమిషాలపాటు చేయాలి. కుర్చీలో కూర్చునా లేదా నిలబడినా నిటారుగా ఉండాలి. కంప్యూటర్ స్క్రీన్ కంటికి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే మెడ, వెన్ను నొప్పులు రావు.
 
ఉదయం పూట టిఫిన్ నిర్లక్ష్యం చేయకూడదు. అలానే ఆఫీస్ టైమింగ్స్‌లో టీ, కాఫీ, గ్రీన్ టీ వంటివి సేవించాలి. తగినంత మంచినీళ్లు తాగుతూ ఉండాలి. రోజూ తీసుకొనే ఆహారంలో తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవాలి. తినటానికి టైం లేకుంటే ఆఫీసుకు తీసుకెళ్లి కూడా తినవచ్చు. 
 
మహిళల్లో గుండె వేగం నిమిషానికి 75-80 ఉండాలి. కనుక యోగా చేయాలి. డంబెల్స్‌తో కూడా వ్యాయామం చేయాలి. ఈ తరహా వ్యాయామాలు చేస్తే గుండెకు అందాల్సిన రక్తం సరఫరా అయి ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.