మందార పువ్వులతో ఆరోగ్యం, ఎలాగంటే?
మందార పువ్వులు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మందారపువ్వును హెర్బల్ టీ, కాక్టేల్ రూపాలలోను సేవించవచ్చు. పూలను ఎండబెట్టి హెర్బల్ టీగా తీసుకోవచ్చు. దీనిని ఎలా తయారు చేయాలో చూద్దాం.
నీటిని ఉడకబెట్టిన తర్వాత ఎండిన మందార పువ్వులను అందులో వేయండి. అందులో చక్కెర, కాస్త టీపొడి కలుపుకుని టీలాగా తయారు చేసుకోండి. దీంతో హైబిస్కస్ హెర్బల్ టీ తయారవుతుంది. ప్రతి రోజు దీనిని సేవిస్తుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు వైద్యులు.
అలాగే కాక్టేల్ టీ కొరకు దీనిని చల్లగా చేసి అందులో కొన్ని ఐసు ముక్కలు వేసుకుని తాగితే అదే కాక్టేల్ టీ. ఇలా ప్రతి రోజు తీసుకుటుంటే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. దీంతో శరీరంలోని కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధి, గొంతుకు సంబంధించిన వ్యాధులు తదితర జబ్బులకు మంచి ఔషధంలా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేదవైద్యులు.
మందారంలో విటమిన్ సి, క్యాల్షియం, పీచుపదార్థం (ఫైబర్), ఐరన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, టెటరిక్, ఆక్సీలిక్ యాసిడ్, ఫ్లేవోనైడ్ గ్లైకోసైడ్స్ తగు మోతాదులో లభిస్తాయి. వీటివలన శరీరం ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.