మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (12:51 IST)

అవాంఛిత రోమాలు తొలగించడం ఎలా..?

అందానికి ప్రతిరూపం స్త్రీలు. అటువంటి స్త్రీలు మరింత అందగా కనిపించేందుకు నానారకాల తంటాలు పడుతుంటారు. స్త్రీల సౌందర్యానికి ఆటంకం కలిపించే వాటిలో అవాంఛిత రోమాల సమస్య ఒకటి. ముఖం, చేతులు, కాళ్ళు, శరీరం మీద అవాంఛిత రోమాలు చాలా ఇబ్బందికరంగా, అసౌకర్యానికి గురిచేస్తాయి. వాటిని వాక్సింగ్, షేవింగ్‌తో శాశ్వతంగా నివారించలేం. అయితే ఇంట్లోనే వంటకు ఉపయోగించే వస్తువులతో అవాంఛిత రోమాలను అతిసులువుగా తొలగించవచ్చును.
 
మెంతులను ఉపయోగించి శరీరం మీద ఉన్న అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు. మెంతులను మెత్తగా పౌడర్ చేసి రోజ్ వాటర్‌తో మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు ముఖానికి అప్లై చేసుకోవడం వలన ఉత్తమ ఫలితం ఉంటుంది. ఈ విధంగా వంటింట్లో ఉండే వస్తువులతో అవాంఛిత రోమాలను తొలగించుకోవడం మంచిది. కాకపోతే వీటిని ట్రై చేసే ముందు ప్యాచ్ టెస్ట్‌ను చేసుకోవడం మంచిది. 
 
అవాంఛిత రోమాలను తొలగించడంలో పసుపు ఎంతో దోహదపడుతుంది. పసుపును నీటితో లేదా పాలతో తేమ చేసుకుని స్ర్కబ్ చేసి తొలగించుకోవాలి. ఒక  స్పూన్ శెనగపిండికి చిటికెడు పసుపు, పెరుగు ఒక చెంచా వేసి సున్నితంగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి, మెడకు అప్లైచేసి, ఎండిన తరువాత శుభ్రం చేసుకోవడం వలన అవాంఛిత రోమాలు తొలగుతాయి.