శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (18:23 IST)

మెంతి పేస్ట్‌లో కొద్దిగా పసుపు కలిపి...?

ఉదయం నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత గోరువెచ్చని నీటిలో క్లీంజర్ లేదా ఏదైనా ప్యూరిఫైయింగ్ జెల్ కలిపి ఆ మిశ్రమంతో ముఖాన్ని కడుక్కోవాలి. ఎప్పుడు కూడా మీరు సబ్బును వాడకండి. ఎందుకంటే సబ్బు వలన మీ ముఖంలోనున్న సహజసిద్ధమైన ఆయిల్‌ను పీల్చేస్తుంది. దీంతో చర్మం పొడిబారిపోయే ప్రమాదం ఉంది. 
 
ముఖాన్ని కడిగిన తరువాత ఎల్లప్పుడు ఓ మెత్తని తువాలుతో తుడవాలి. ముఖాన్ని ఎక్కువగా రుద్దకండి.. అలా చేస్తే చర్మంలో పగుళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంది. ఆ తర్వాత టోనింగ్ చేయండి. టోనింగ్‌తో మీ చర్మంలో దాగివున్న మురికి, మిగిలివున్న మేకప్ బయటకు వచ్చేస్తుంది. టోనర్‌తో మీ ముఖ చర్మం సాధారణ స్థితికి వస్తుంది. దీంతో ముఖవర్చస్సు పెరుగుతుంది.
 
ఆ తరువాత చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అది మీ చర్మానికి తగ్గట్టుండాలి. చర్మంపై మాయిశ్చరైజర్ చేయడం వలన మీ చర్మం సుతి మెత్తగాను, నునుపుగాను తయారవుతుంది. దీంతోపాటు చర్మంలోని సూక్ష్మరంద్రాలు.. పొడిబారడం నుండి కాపాబడుతాయి. మాయిశ్చరైజర్ చేసిన తరువాత సన్‌స్క్రీన్ వాడొచ్చు. అలానే పావుకప్పు మెంతి పేస్ట్‌లో కొద్దిగా పసుపు కలిపి రాసుకుంటే కూడా మంచిది. ఇలా చేయడం వలన ముఖం చర్మం తాజాగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.