శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (14:28 IST)

ఫేస్‌బుక్‌ను నెల రోజులు వాడకుండా వుంటే.. ఏం జరుగుతుందో తెలుసా?

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్‌ను వాడని వారంటూ వుండరు. ఫేస్‌బుక్.. ప్రజల జీవితాల్లో భాగమైపోయింది. ఫేస్‌బుక్ వాడకం లేనిదే పొద్దు గడవని రోజుండదు. ప్రతి రోజూ అందరూ ఫేస్‌బుక్‌ లేనిదే వుండలేకపోతున్నారు. అలాంటి ఫేస్‌బుక్‌కు ఓ నెల పాటు దూరంగా వుంటే ఎలా వుంటుంది. అమ్మో.. ఫేస్  బుక్ లేనిదే మేముండమని చాలామంది చెప్తారు. 
 
అయితే నిజానికి ఈ ఫేస్‌బుక్‌కు ఓ నెల  పాటు దూరంగా వుంటే జీవితంలో చెప్పలేనంత ఆనందంగా, సంతోషంగా వుంటారని న్యూయార్క్ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఫేస్‌బుక్‌కు దూరంగా ఉన్నవారు తాము మునుపటికంటే మరింత సంతోషంగా వున్నట్లు అధ్యయనంలో వెల్లడి అయ్యింది. 
 
ఎఫ్‌బీతో పాటు, ఇతర సోషల్ మీడియా సైట్లకు దూరంగా వున్న వారికి మరింత సమయం కలిసివచ్చిందని.. వారు కుటుంబం కోసం, చదువు కోసం మరింత సమయం కేటాయించారని.. పరిశోధకులు కనుగొన్నారు. వెల్ఫేర్ ఎఫెక్ట్స్ ఆఫ్ సోషల్ మీడియా పేరుతో జరిపిన ఈ అధ్యయనం 2వేల మందికి పైగా జరిగిందని పరిశోధకులు వెల్లడించారు.