శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (11:34 IST)

కొబ్బరినూనెను తలకు పట్టిస్తారు.. అది ఏం చేస్తుందో తెలుసా?

కొబ్బరినూనె స్నానానికి ముందు రాసుకుంటే లాభమేంటో తెలుసుకోవాలా? అయితే చదవండి. సహజసిద్ధమైన కొబ్బరినూనె చర్మానికీ, జుట్టుకీ ఎంతో మేలు చేస్తుంది. మాయిశ్చరైజర్‌గా పనిచేసే కొబ్బరి నూనెను స్నానానికి ముందు శరీరానికి రాసుకోవడం ద్వారా చర్మంపై ఉన్న మచ్చలూ, గీతలు కొంతకాలానికి తగ్గుముఖం పడతాయి. స్నానానికి ముందు శరీరానికి కొబ్బరి నూనె రాసుకుంటే.. ఒంట్లోని తేమ బయటికి పోకుండా ఉంటుంది. 
 
కొబ్బరి నూనెలోని యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ వంటి ఖనిజాలు చర్మాన్ని కాంతివంతంగా మార్చేలా చేస్తాయి. తరచు కొబ్బరి నూనెను చర్మానికి రాసుకుంటే జిడ్డు చర్మం పోతుంది. కొబ్బరి నూనె ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందానికి కూడా అంతే మేలు చేస్తుంది. జుట్టు పెరుగుదలకు కొబ్బరి నూనె ఎంతో దోహదం చేస్తుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ నూనెను తలకు పట్టించి ఓ గంటపాటు నిద్రిస్తే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
గోరువెచ్చని కొబ్బరి నూనెతో తలకు మసాజ్ చేసుకుంటే జుట్టు మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. జుట్టు నుంచి ప్రోటీన్లు బయటికి పోవడం తగ్గుతుంది. ఇది జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. ఇంకా కొబ్బరి నూనెను మేకప్ రిమూవర్‌గానూ వాడుకోవచ్చు. కనురెప్పలకి మస్కారా, కాటుక వంటి మేకప్ కొబ్బరి నూనెలో ముంచిన దూదితో తుడిస్తే సులభంగా పోతుంది.