శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 16 జులై 2024 (17:31 IST)

విజయసాయి పూజకు పనికి వస్తాడా? పనికి రాడా? టీడీపీ నేత ఆనం కామెంట్స్ (Video)

anam venkataramana
వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి - దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, నెల్లూరు జిల్లా సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి స్పందించారు. సోమవారం శాంతి భర్త మదన్ మోహన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. విజయసాయి రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై ఆయన నిరూపించుకోవాల్సి ఉందన్నారు. దీనికి ఏకైక మార్గం డీఎన్‌ఏ టెస్ట్ ఒక్కటే శరణ్యమన్నారు. తనకు తెలిసినంత వరకు విజయసాయి రెడ్డి పూజకు పనికిరాని పువ్వు అని చెప్పారు. అందుకే ఆయన ఓ అమ్మాయిని తన కుమార్తెగా దత్తత తీసుకున్నారని ఆయన గుర్తుచేశారు. ఇపుడు శాంతి గర్భందాల్చిన అంశంలోనూ విజయసాయిరెడ్డిపై తనకు ఎలాంటి సందేహం లేదని, ఇందులో ఆయన పాత్ర ఉండదన్న నమ్మకం ఉందన్నారు. అయితే, శాంతి భర్త లేవనెత్తిన అనేక అంశాలపై ఓ క్లారిటీ రావాల్సివుందన్నారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లభించాలంటే డీఎన్ఏ టెస్టుకు విజయసాయి రెడ్డి సిద్ధం కావాలని, ఇందుకోసం ఆయన ఒకే ఒక వెంట్రుకను ఇస్తే కేవలం రెండు గంటల్లోనే ఈ అంశానికి సమాధానం లభిస్తుందని, ఆయనకు కూడా క్లీన్‌చిట్ లభిస్తుందని ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. 
 
మదన్ మోహన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి, కేంద్ర విజిలెన్స్ శాఖ రంగంలోకి దిగి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మదన్ మోహన్... హైదరాబాదులో విజయసాయి ఇంటికి వెళ్లదా, లేదా? అక్కడ్నించి వైజాగ్ వచ్చాడా, లేదా? అనేదానిపై గూగుల్ టేకౌట్ తీయాలని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి ఆమెకు ఎందుకు డబ్బులు ఇచ్చారు? ఆమెతో విశాఖలో ఏమేం పనులు చేయించుకున్నారు? ఏ భూములు కొట్టేశారు? అనే విషయాలు విచారణ చేస్తే బయటికి వస్తాయని అన్నారు. అందుకే విజిలెన్స్ విచారణ అడుగుతున్నామని ఆనం వెంకటరమణారెడ్డి చెప్పారు.
 
విశాఖను దోచుకున్నది విజయసాయిరెడ్డేనని దీంతో అర్థమైపోయింది. ఒక పార్లమెంటు సభ్యుడు తనకు రూ.1.60 కోట్లు ఇచ్చాడని ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి చెబుతున్నాడు. దీనిపై సీబీఐ విచారణ కూడా వేయాలని అడుగుతున్నాం. విజయసాయి రెడ్డి తనకు డబ్బు ఇచ్చాడని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒప్పుకున్న తర్వాత విజయసాయిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. రెండు లాఠీ దెబ్బలు తగిలిస్తే అన్ని నిజాలు బయటికి వస్తాయి" అని అనం పేర్కొన్నారు.
 
ఇక, శాంతి వ్యవహారంలో తనకేమీ తెలియదని విజయసాయిరెడ్డి అంటున్నారని, అలాంటప్పుడు విజయసాయిరెడ్డి | డీఎన్ ఏ చేయించుకోవాలని ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. డీఎన్ఏ టెస్టుకు విజయసాయి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. డీఎన్ఏ టెస్టులో ఏమీ లేకపోతే మంచిదే కదా అని వ్యాఖ్యానించారు.