మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శనివారం, 25 నవంబరు 2023 (14:11 IST)

తిరుమల నడకదారిలో మెట్లు ఎక్కుతుండగా గుండెపోటు నిఘా డీఎస్పీ మృతి

Heart attack
తిరుమల నడకదారిలో గుండెపోటుతో ఇంటెలిజెన్స్ మెట్లు ఎక్కువుతూ ప్రాణాలు కోల్పోయాడు. 1805వ మెట్టు వద్ద కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఆయనను ఆస్పత్రికి తరలించే లోపే తుదిశ్వాస విడిచారు. మృతుడిని డీఎస్పీ కృపాకర్ హఠాన్మరణం మెట్లదారిలో వెళుతుండగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు కృపాకర్ తిరుమల చేరుకున్నారు. మెట్లదారిలో సెక్యూరిటీ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు కృపాకర్ తిరుమల చేరుకున్నారు. మెట్ల దారిలో గుండా పైకి వెళుతుండగా 1805 మెట్లు దగ్గర అస్వస్థతకు గురయ్యారు. 
 
గుండెనొప్పితో కుప్పకూలారు. డీఎస్పీ కృపాకర్ వయసు 59 సంవత్సరాలు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ సమీపంలోని పోరంకి పోలీసులు వెల్లడించారు కృపాకర్ మరణవార్తను ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేసినట్టు వివరించారు.