సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 11 జనవరి 2022 (12:35 IST)

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లిసిన శార‌దా పీఠం స్వాత్మానందేంద్ర

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను తాడేప‌ల్లిలోని ఆయ‌న నివాసంలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి క‌లిశారు. విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వన పత్రికను ముఖ్యమంత్రి జగన్‌కు అందజేసి, వేద ఆశీర్వచనం ఇచ్చారు. 
 
 
వ‌చ్చేనెల ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు శ్రీ శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నామ‌ని, దానికి సీఎం జ‌గ‌న్ వ‌చ్చి ఆశీర్వ‌చ‌నం పొందాల‌ని స్వాత్మానందేంద్ర కోరారు. స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో పాటు ముఖ్యమంత్రిని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కూడా క‌లిశారు. శారదా పీఠంలో వార్షిక మహోత్సవాల‌కు హాజ‌రుకావాల‌ని ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ కి కూడా స్వాత్మానందేంద్ర ఆహ్వానించారు.