శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 16 నవంబరు 2022 (08:57 IST)

నేడు భాగ్యనగరికి సీఎం జగన్.. హీరో కృష్ణకు నివాళి

jagan - krishna
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం హైదరాబాద్ నగరానికి వెళుతున్నారు. మంగవారం వేకువజామున మృతి చెందిన హీరో కృష్ణ పార్థివ దేహానికి ఆయన నివాళులు అర్పిస్తారు. ఇందుకోసమే ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్ నగరానికి వెళుతున్నారు. 
 
వృద్దాప్యంతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా హీరో కృష్ణ 79 యేళ్ల వయసులో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తె్లసిందే. ఆయన అంత్యక్రియలు బుధవారం హైదరాబాద్ నగరంలోని మహా ప్రస్థానంలో జరుగనున్నాయి. 
 
ఈ క్రమంలో కృష్ణ అంత్యక్రియలకు ముందే హైదరాబాద్ నగరానికి జగన్ చేరుకుని నేరుగా పద్మాలయ స్టూడియో‌స్‌కు వెళతారు. అక్కడ ఆయన భౌతికకాయానికి నివాళి అర్పిస్తారు. కృష్ణ కుటుంబ సభ్యులను పరార్శించి, ఓదార్చుతారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఆయన తిరిగ తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.