తిరుమలపై కొండపై వైసీపీ జెండాతో జీపు.. ఏం జరుగుతోంది.. అచ్చెన్నాయుడు
తిరుమల కొండపై రాజకీయ ప్రచారాలు జరగడం నిషేధం. అలాంటిది.. తిరుమల కొండపై వైసీపీ జెండాతో జీపు తిరుగుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.
ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలంటూ వైకాపా ప్రచారం సాగిస్తోందని విమర్శించారు. జగన్ రెడ్డి అండ్ కో తిరుమల వంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాన్ని రాజకీయ వేదికగా మార్చేశారంటూ మండిపడ్డారు.
తిరుమలలో విజిలెన్స్ సిబ్బంది వున్నారా..? లేదా..? అని ఆయన గట్టిగా అడిగారు. కొండపై ఇలాంటి కార్యకలాపాలు జరుగుతుంటే విజిలెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారని అచ్చెన్నాయుడు నిలదీశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమలలో ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద విషయం జరుగుతుందని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.