సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 జనవరి 2023 (20:07 IST)

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. అచ్చెన్నాయుడుపై కేసు

Achennaidu
చిత్తూరు జిల్లా కుప్పంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నేత అచ్చెన్నాయుడుపై కేసు నమోదైంది. 
 
అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు పోలీసుల మనోభావాలు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పాలన తీరును విమర్శిస్తూ పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ ఘటనకు సంబంధించి అచ్చెన్నాయుడుపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) దాఖలైంది.