1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 ఏప్రియల్ 2022 (09:35 IST)

నాకు జగన్ అంటే గౌరవం కానీ అతడు రాష్ట్రానికి పట్టిన దరిద్రం?

bandla ganesh
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు సినీ నిర్మాత బండ్ల గణేష్. విజయసాయి కులం ప్రస్తావన తేవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నచ్చని వారిని పేరు పెట్టి తిట్టాలన్నారు. చంద్రబాబును అడ్డు పెట్టుకుని ఓవర్గం వారిని తిట్టకండన్నారు. 
 
తనకు జగన్ అంటే గౌరవం అన్న బండ్ల గణేష్.., విజయసాయి రెడ్డిని రాష్ట్రానికి పట్టిన దరిద్రమని ట్వీట్ చేశారు. అన్న నుంచి చెల్లిని దూరం చేయగలిగిన దగుల్బాజీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
 
ఇకపోతే.. గత సర్కార్ తమ వర్గానికి చెందినవారికే ఉద్యోగాలు కల్పించేవారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. అంతేకాదు టీడీపీ కుల పార్టీ అన్నారు విజయసాయి రెడ్డి. 
 
అయితే వైసీసీ సర్కార్ మాత్రం కుల, మతాలకు అతీతంగా అవకాశాలు కల్పిస్తుందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేశారు.