గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2020 (08:06 IST)

కరోనాతో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే మృతి

సీపీఎం సీనియర్ నేత, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనాతో మృతి చెందారు. స్వగ్రామం వీఆర్‌పురం మండలం సున్నం వారి గూడెంలో రాజయ్య తీవ్ర జ్వరంతో పడుతున్నారు.
 
పరిస్థితి విషమించడంతో విజయవాడ తరలించగా...చికిత్స పొందుతూ రాజయ్య మృతి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భద్రాచలం నియోజకవర్గం నుండి మూడు పర్యాయాలు రాజయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

ప్రజా సమస్యలపై ఆయన నిరాటంకంగా పోరాడారు. ఆయన మృతి పట్ల వివిధ పార్టీలకు చెందిన నేతలు సంతాపం తెలిపారు.