బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 12 మార్చి 2020 (06:41 IST)

ఫాస్ట్ ట్రాక్ విధానంలో కుల ధ్రువీకరణ పత్రాలు: ఎన్నికల కమీషనర్

కుల ధ్రువీకరణ పత్రాలు, ఇతర సంబంధించిన పత్రాలు జారీ చేయడంలో ఫాస్ట్ ట్రాక్ విధానంలో జారీ చేయాలని ఆదేశించామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.

ఇందుకోసం ఇప్పటికే జిల్లాలలో ప్రత్యేక సీనియర్ అధికారులను నియమించామని, వారు క్షేత్రస్థాయిలో పని ప్రారంభించారన్నారు. జిల్లా కలెక్టర్ లతో సమన్వయం చేసుకుంటూ, ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే ప్రభుత్వపధకాలు నిలుపుదల చేయాలని గతంలో చెప్పామని తెలిపారు.

ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షలు చేసుకోవచ్చుని తెలిపారు. అది ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. కలెక్టర్లతో పాటుగా క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది కూడా ఎన్నికలు పూర్తి ప్రశాంతంగా నిర్వహించేలా సహకారాన్ని అందించాలని ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు.  కుల ధ్రువీకరణ పత్రాలు, ఇతర సంబంధించిన పత్రాలు జారీ చేయడంలో ఉద్దేశ్యపూర్వకంగా వ్యవరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 
 
 
చిత్తూరు జిల్లాలో  బోధ మండలంలో బీజేపి పార్టి అభ్యర్ది నామినేషన్స్ విషయంలో వెయ్యకుండా జరిగిన దాడిలో ఎఫ్ఐఆర్  నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారన్నారు. ఎన్నికలు పూర్తి ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ఎన్నికల కమిషన్ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ని పోలీస్ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ పై నమ్మకం ఉందన్నారు.

డీజిపి తో కూడా మాట్లాడం జరిగిందని, ఎన్నికలను పూర్తి సజావుగా నిర్వహించడంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆదేశించామన్నారు. నామినేషన్ లు వెయ్యకుండా అడ్డుకునే సంఘటనలు తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించామన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఏర్పాటు చేసిన నిఘా యాప్ ను స్వాగతిస్తున్నామని, ఎన్నికల కమిషన్ చేపడుతున్న చర్యలకు అదనంగా యాప్ సేవలు పరిగణనలోకి తీసుకోవడం జరుగుతున్నదని తెలిపారు.

ప్రభుత్వ భవనాలకు ఉన్న రంగులు తొలగించాలని హైకోర్ట్ చెప్పిందని , ఇందుకు సమయం నిర్ధేశించినదని, ఆ లోపున వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.  ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు తో ఏర్పాటు చేసుకున్న దివంగత నేతలు విగ్రహాలకు ముసుగులు వేయాల్సిన అవసరం లేదన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా  దివంగత  నేతల విగ్రహాలకు ముసుగులు వేయ్యనవసరం లేదని, ఈ విషయంలో మాయావతి, కాన్షిరాం సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం సూచనాలను రమేష్ కుమార్ ఊటంకించారు.

రాష్ట్రంలో  కొన్నిచోట్ల  చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చాయని వాటిపైన దృష్టి పెట్టామన్నారు. ఎప్పటికప్పుడు జిల్లాలవారిగా నమోదు అవుతున్న కేసులు వివరాలు తెలుసుకుంటున్నామని, వాటిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లకు స్పష్టం చేశామన్నారు. ఈనెల 15 న మొదటివిడుత , 17 న రెండోవ విడత పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు.

వాలంటీర్ల వారికి కేటాయించిన వర్క్ చార్ట్  ప్రకారం సేవలు  అందిచవచ్చు, అలా కాక పార్టిల ప్రచారం చేయకూడదన్నారు. అటువంటి ఫిర్యాదులను తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.