గురువారం, 21 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (17:43 IST)

శబరిమలైకు డోలి వెళ్లి స్వామి దర్శనం చేసుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత శబరిమలై పుణ్యక్షేత్రానికి వెల్లారు. భక్తులు, అభిమానుల తాకిడి దెబ్బకు ఆయన కొండపైకి నడిచి వెళ్లకుండా, డోలిలో పుణ్యక్షేత్రానికి చేరుకుని స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్వయంగా షేర్ చేశారు. 
 
"చాలా యేళ్ల తర్వాత శబరిమలకు వచ్చి స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. అయితే, భక్తుల రద్దీ, అభిమానుల తాకిడి కారణంగా అందరినీ అసౌకర్యానికి గురిచేయకుండా, డోలిలో వెళ్లవలసి వచ్చింది. ఆ స్వామి పుణ్య దర్శనానికి భక్తుల కోసం తమ శ్రమధారపోస్తున్న ఆ శ్రమైక సోదరులకు నా హృదయాంజలి. ఈ ప్రయాణంలో ఫీనిక్స్ చుక్కపల్లి సురేష్, ఫీనిక్స్ గోపి గార్ల కుటుంబాలకుతోడు మంచి అనుభూతిని ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చారు అంటూ ట్వీట్ చేసారు.