ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 జూన్ 2024 (11:02 IST)

తిరుమల: సర్వదర్శనానికి 16 గంటలు.. హుండీ ఆదాయం రూ.4.01 కోట్లు

venkateswara swamy
శ్రీవారి సర్వదర్శనం కోసం 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి వున్నారు. మంగళవారం భక్తులు భారీగా తరలివచ్చారు. సర్వదర్శనానికి 16 గంటలు పట్టింది. కాగా ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు ఉన్నవారు 4 గంటల్లో స్వామివారి దర్శనం పొందగలిగారు.
 
అలాగే భక్తులు 6 కంపార్ట్‌మెంట్లలో టైమ్ స్లాట్ (ఎస్‌ఎస్‌డి) దర్శనం కోసం వేచి ఉన్నారు. స్వామివారి దర్శనం కోసం 5 గంటల వేచి ఉన్నారు.
 
కాగా, సోమవారం 71,824 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 28,462 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అదనంగా స్వామివారికి కానుకగా హుండీలో రూ.4.01 కోట్లు చేరింది.