మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (10:08 IST)

అనంతపురం జేఎన్‌టీయూలో ర్యాగింగ్ భూతం - 12 మంది విద్యార్థుల సస్పెండ్

ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లాలోని జేఎన్టీయూలో ర్యాగింగ్ భూతం మళ్లీ బుసలు కొట్టింది. దీంతో 12 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. అడ్డూ అదుపులేని అకృత్యాలతో జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు వేధించారు. ఈ వేధింపులు భరించలేని జూనియర్ విద్యార్థులు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. 
 
దీనిపై స్పందించిన జేఎన్టీయూ ప్రిన్సిపాల్ ర్యాగింగ్‌కు పాల్పడిన 12 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. వీరిలో కెమికల్, కంప్యూటర్ సైన్సెస్ గ్రూపులకు చెందిన ద్వితీయ సంవత్సర విద్యార్థులను సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సుజాత శనివారం ఉత్తర్వులు జారీచేసింది. జేఎన్టీయూ-అనంతపురం చరిత్రలో ఒకేసారి 12 మంది విద్యార్థులను సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.