బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 28 జనవరి 2022 (13:31 IST)

రామ్ గోపాల్ వ‌ర్మ‌కు నెటిజ‌న్లు చీవాట్లు

Varma smoking
ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌ర‌లా త‌న రూటులోకి వ‌చ్చేశాడు. నిన్న‌టి వ‌ర‌కు లాల్ స‌లామ్  అంటూ కొండా సినిమా గురించి ప్ర‌మోష‌న్ చేశాడు. కొండా సురేఖ ఆధ్వ‌ర్యంలో విడుదైల‌న ఆడియోలో `కొండా` ట్రైల‌ర్‌ను అడ్డుకునే ద‌మ్ము వుందా! అంటూ ఆమె మాట్లాడుతుంటే, వ‌ర్మ ఆమె మాట‌ల‌కు ఆవేశ‌మైన ముఖ‌క‌వ‌ళిక‌లు చూపిస్తూ.. లాల్ స‌లామ్ అంటూ అరిచాడు. ఇక ఇప్పుడు ఆ సినిమా ఎప్పుడు విడుద‌ల అవుతుందో తెలియ‌దు.
 
తాజాగా త‌న సోష‌ల్ మీడియాలో పాత రూటులోనే ఫొటోలు పెట్టాడు. ఓ డాన్స‌ర్‌, న‌టి ప‌బ్‌లో ఫుల్‌గా మందుతాగి సిగ‌రెట్ తాగుతున్న ఫొటోను పెట్టాడు. ఆమె సిగ‌రెట్‌గా ఇష్టంగా తాగుతుండ‌గా, వ‌ర్మ సిగ‌రెట్ తాగుతున్న‌ట్లు న‌టి్స్తూ క‌నిపించాడు. అందులో మ‌త్తుగా క‌నిపించాడు. ఇది దేనికోసం పెట్టాడ‌నే వివ‌రించ‌క‌పోయినా కొండా సినిమాలో ఐటం సాంగ్ సంద‌ర్భంగా తీసిన‌ట్లుగా భావిస్తున్నారు. ఇక కొంద‌రు నెటిజ‌న్లు ఆయ‌నకు బాగానే క్లాస్ పీకారు.  ఏదైనా సొసైటీకి మంచి మెసేజ్ ఇవండీ సార్.  ఎందుకు ఎలాంటివి` అని కొంద‌రు అన్నారు. యాద‌వ్ అనే నెటిజన్ మాత్రం  - సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం. బాధ్యత కలిగిన వ్యక్తిగా సిగరెట్ తాగే ఫోటోలు,  మద్యం తాగే ఫోటోలు, పబ్ డ్యాన్స్ ఫోటోలు, హీరోయిన్ హగ్ ఫోటోలు,ఇతర బ్యాడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టవద్దు. ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో పెడితే యువత చెడిపోతారు.దీన్ని కంట్రోల్ చేసేవారు లేరా అంటూ వాపోయాడు.
 
సో. అంత‌కుముందు సినిమా టికెట్ల‌పై త‌న ఆవేద‌న వెళ్ళ‌గ‌క్కిన వ‌ర్మ ఇప్పుడు మ‌ర‌లా అమ్మాయిల‌తో ఎంజాయ్ చేసే పిక్‌ల‌తో స‌ర‌దాప‌డుతున్నాడు.