శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 మార్చి 2022 (17:04 IST)

ఆంధ్రాలో ఏ క్షణమైనా ఎన్నికలు : టీడీపీ నేత అచ్చెన్నాయుడు

ఏపీకి చెందిన టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ క్షణమైనా అసెంబ్లీ ఎన్నికలు జరగొచ్చని ఆయన జోస్యం చెప్పారు. ఎందుకంటే.. ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి నిద్రలో నుంచి లేచి అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. 
 
అందువల్ల పార్టీ శ్రేణులు ఎన్నికలు ఎపుడు వచ్చినా సిద్దంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగుల వల్లే 2019లో తమ పార్టీ ఓడిపోయామని, అపుడు ఉద్యోగులంతా జగన్ చూపిన ప్రలోభాలకు లొంగిపోయారని చెప్పారు. కానీ, ఈ దపా మాత్రం వైకాపా చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.