బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 అక్టోబరు 2021 (08:12 IST)

దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి వర్ష సూచన

ఒకవైపు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మరోవైపు, దేశంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ రెండింటి ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
ఈ నెల 30వ తేదీ వరకు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడతాయని వివరించింది. శుక్ర, శనివారాల్లో విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని తెలిపింది. 
 
మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కూడా ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, ఇటీవల తెలంగాణా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసిన విషయం తెల్సిందే.