శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 26 జనవరి 2019 (15:27 IST)

ఆంధ్రప్రదేశ్‌ను బిర్యానీలా తినేద్దామని జగన్ ప్లాన్ వేశారు.. నాగబాబు

మొన్నటికి మొన్న నందమూరి హీరో బాలయ్యపై కామెంట్లు చేసి వార్తల్లో నిలిచిన మెగా బ్రదర్ నాగబాబు.. తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై వీడియో విడుదల చేశారు. రాబోయే ఎన్నికల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్‌‌ను బిర్యానీలా తినేద్దామని జగన్ ప్లాన్ వేశారని నాగబాబు విమర్శించారు. జగన్‌కు తోడుగా ఆయన అనుచరులు కూడా వున్నారని వ్యాఖ్యానించారు. 
 
రెండేళ్లు ఓపిక పట్టండి. మీరు పోగట్టుకున్నదానికి నాలుగింతలు వచ్చేట్లు చేస్తా. రెండేళ్లు ఓపిక పడితే మన ప్లేట్లో మన బిర్యానీ మనమే తినొచ్చునని జగన్ గతంలో పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలను వీడియోలో కోట్ చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓ నేత వైసీపీ నేత రూ.10 కోట్లు ఖర్చు పెట్టారని అనుకుందాం. 
 
ప్రస్తుతం ఇంకో ఐదు కోట్లు వెరసీ రూ.15 కోట్లు ఖర్చు అవుతుందని అనుకుంటే... ఎన్నికల తర్వాత నాలుగు రెట్లు అంటే రూ.75 కోట్లు సంపాదిస్తామని జగన్ చెప్తున్నారా.. అంటూ ప్రశ్నించారు.  జగన్ కు అసాధారణ విజన్ ఉందనీ, ఇలాంటి నాయకుడు దేశంలో ఎక్కడా దొరకడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.