శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 30 జనవరి 2021 (10:39 IST)

ఏపీలో 1315 సర్పంచ్‌ స్థానాలకు నామినేషన్లు

సర్పంచ్‌ స్థానాలకు రాష్ట్ర వ్యాప్తంగా 1315 నామినేషన్లు వేశారు. 2200 వార్డులకు నామినేషన్లు దాఖలు  చేశారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో అత్యధిక నామినేషన్లు దాఖలు చేశారు. అనేక మలుపులు, ఉత్కంఠ పరిణామాల అనంతరం... పంచాయతీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం మొదలైంది.

ఫిబ్రవరి 9వ తేదీన 12 జిల్లాల్లో 18 డివిజన్ల పరిధిలోని గ్రామ పంచాయతీలకు పోలింగ్‌ జరగనుంది. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) వీటన్నింటికీ కలిపి 23న ఉమ్మడి నోటిఫికేషన్‌ జారీచేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఫిబ్రవరి 5న తొలివిడత పోలింగ్‌ జరగాల్సి ఉంది.

కానీ... కోర్టులో కేసు, ప్రభుత్వ సహాయ నిరాకరణ తదితర కారణాలతో తొలివిడత పోలింగ్‌ను ఫిబ్రవరి 21కి మార్చారు. మిగిలిన విడతల ఎన్నికలు యథాతథంగా జరుగనున్నాయి. ఇందులోభాగంగా 12జిల్లాల్లో, 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని పంచాయతీలకు 9వ తేదీన పోలింగ్‌ జరగనుంది.