శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 22 అక్టోబరు 2021 (12:57 IST)

ఆ ప‌దానికి... మీరు బాగున్నారా.. అనే అర్థం కూడా వస్తుందట‌!

ఏపీ ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుధ్ధి ఉంటే, టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాల‌ని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ డిమాండు చేశారు. అంతర్జాతీయ స్థాయి నుంచి దేశీయంగా ఎక్కడ మాదక ద్రవ్యాలు, గంజాయి పట్టుబడినా ఏపీ పేరే ఎందుకు వినిపిస్తుందో సీఎం, డీజీపీ ఆలోచించాల‌ని అన్నా రు. కేసులు, దాడులతో ప్రతిపక్షాలను అణచి వేయడం దేశ ప్రధానులుగా ఉన్నవారి వల్లే కాలేదన్నారు.
 
పోలీస్ అమరవీరుల దినోత్సవంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రతిపక్షంపై నిందారోపణలు చేశార‌ని,  తాము, తమపార్టీ అనని మాటలను అన్నట్లుగా వక్రీకరించడానికి శతవిధాలా ప్రయత్నించి, కొత్త భాష్యాలు చెప్పడానికి ప్రయత్నించి భంగపడ్డారని పయ్యావుల ఎద్దేవా చేశారు. 
 
బోషడీకే అనే పదానికి నేనో, ముఖ్యమంత్రో చెప్పిందే అర్థం కిందకు రాదు. బోషడీకే అనేది గుజరాత్ లోని ఒక గ్రామం పేరని కూడా ఈ ముఖ్యమంత్రికి తెలియదు. అమాయకులైన వారిని  బ్రిటీషు వారు బోషడీకే అని సంబోధించేవారని చెప్పుకుంటారు. మీరు బాగున్నారా.. అనేఅర్థం కూడా వస్తుందని చెబుతున్నారు. 
 
 ఈ పదాలు, వాటి అర్థాలు కాసేపు పక్కన పెడితే, అసలు ఈ రగడ ఎక్కడ, ఎవరితో మొదలైందో అందరూ గమనించాలి. అంతర్జాతీయం మొదలుకొని, దేశీయంగా సాగుతున్న డ్రగ్స్ దందాలో ఆంధ్రప్రదేశ్ పేరు ఎందుకునానుతోంది. పక్కరాష్ట్రాల పోలీస్ అధికారులుపదేపదే ఏపీపేరు ఎందుకు చెబుతున్నారు? అదే ఆందోళనను ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశంపార్టీ ఇక్కడ వ్యక్తపరిస్తే, అది తప్పా? అని ప‌య్యావుల ప్ర‌శ్నించారు.   
 
గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల బారినపడకుండా, యువత నిర్వీర్యం కాకుండా కాపాడే బాధ్యతను తెలుగుదేశం పార్టీ తన భుజస్కంధాలపై వేసుకోవడం తప్పా? పొరుగురాష్ట్రంలో ముఖ్యమంత్రి గంజాయిసాగు, రవాణా అమ్మకంపై కఠిన చర్యలు తీసుకుంటుంటే, ఈ ముఖ్యమంత్రి డ్రగ్స్ పై మాట్లాడుతున్న తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులు పెట్టి, జైళ్లకు పంపుతూ రాక్షసానందం పొందుతున్నాడు.. వైసీపీప్రభుత్వం డ్రగ్స్ మాఫియాను పెంచి పోషిస్తూ, దాన్ని అడ్డుకోవాలని చూస్తున్న తెలుగుదేశాన్ని నిలువరించాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. డీజీపీ కార్యాలయంలో పీఆర్వోగా పనిచేస్తున్న వ్యక్తి, టీడీపీ కార్యాలయంపైకి దాడికి వచ్చి, తమ నేతలకు పట్టుబడినప్పుడే, ఈ దాడి ఘటనలో ఎవరి ప్రమేయముందో స్పష్టమైపోయింద‌న్నారు.  
 
టీడీపీ కార్యాలయంలో మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి. దాడికి పాల్పడిన వారిలో దాదాపు 10 మంది పోలీసులు ప్రత్యక్షంగా పాల్గొన్నారనే సమాచారం మాకుంది. జరిగిన దాడి ఘటనపై  పోలీస్ యంత్రాంగం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పై పెట్టిన సెక్షన్లు, నమోదు చేసిన ఎఫ్ఐఆర్ చూస్తుంటే, పోలీసులకు భంగపాటు తప్పదనిపిస్తోంద‌న్నారు.

ఎప్పుడో రాత్రి 8.30 ని.లకు లోకేశ్ కార్యాలయానికి వస్తే, సాయంత్రం 6.30నిలకు ఆయన, కార్యాలయంలో పట్టుబడిన వ్యక్తిపై దాడి చేశాడని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. మా సిబ్బందికి పట్టుబడిన వ్యక్తి నక్సల్స్ యాంటీ విభాగంలో పనిచేసే వ్యక్తిగా చూపడానికి  ప్రయత్నిస్తున్నారు. నిజంగా అతను అదే అయితే కొంత మంది నక్సల్స్ ఫోటోలు అతనికి చూపించి గుర్తుపట్టమంటాం... అప్పుడు తేలుతుంది... అతని అసలు రంగేమిటో. ఈ కేసుకి  సంబంధించిన మూలాలను తేల్చడం కోసం అవసరమైతే సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ డిమాండ్ చేయబోతోంద‌ని ప‌య్యావుల చెప్పారు.