శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 22 జులై 2020 (19:53 IST)

చాతుర్మాస్య దీక్షలో జనసైనికులతో పవన్ ఇంట్రాక్షన్

టెలికాన్ఫెరెన్స్ ద్వారా పార్టీ నాయకులు, శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలతో పవన్ కళ్యాణ్ అనుసంధానం అవుతున్నారు. జనసేన పార్టీ మీడియా విభాగం, సోషల్ మీడియా విభాగాల వారికి 1 గంట పది నిమిషాలు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ప్రస్తుతం చాతుర్మాస్య దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ పూర్తి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నేసిన చేనేత వస్త్రాలను ధరించి పార్టీ శ్రేణుల కోరిక మేరకు ఈ ఇంటర్వూకు హాజరయ్యారు.
జాతీయ ప్రాంతీయ అంశాలపై ఆయన సుదీర్ఘంగా తన అభిప్రాయాలను జనసేన విధానాన్ని వెల్లడించారు. కరోనా విజృంభణ, ఆత్మనిర్భర భారత్ కార్యక్రమం, అమరావత రైతుల ఆందోళన, తన రాబోవు సినిమాలు, పవన్ చేస్తున్న చతుర్మాస్య దీక్ష ఇలా పలు అంశాలపై పవన్ మనసు విప్పి మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూ జనసేన పార్టీ సోషల్ మీడియాలో రేపు ప్రసారం కానుంది.