శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 8 జూన్ 2020 (20:05 IST)

క‌రోనాపై ప్ర‌జ‌ల్లో ధైర్యం క‌లిగించేలా ప్ర‌చారం చేయాలి: జగన్

వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీకి వెంట‌నే నోటిఫికేషన్ ఇవ్వాల‌ని ఏపి సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. కోవిడ్- 19పై తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో సోమ‌వారం సీఎం జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీకి జాబ్‌ నోటిఫికేషన్‌ వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. కోవిడ్‌పై ఇప్పుడిక అవేర్‌నెస్, ఎడ్యుకేట్‌ చేయడం మన ముందున్న కర్తవ్యం అన్నారు. ఇంటర్‌ స్టేట్ బోర్డర్స్‌ ద్వారా రాకపోకల వివరాల‌పై సీఎం అడిగి తెలుసుకున్నారు. 6 రాష్ట్రాల నుంచి వస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి పెడుతున్న‌ట్లు అధికారులు సీఎంకు వివ‌రించారు.

కోవిడ్‌ క్లస్టర్ల వివరాలు, ఏరియా సైజ్‌ వివరాల‌పై సీఎం ఆరా తీశారు. క్లస్టర్ల క్లాసిఫికేషన్‌ను మరోసారి పరిశీలించి తగిన చర్యలు చేప‌ట్టాల‌న్నారు. ఎవరైనా కోవిడ్‌ భాదితులు నేరుగా పరీక్షలు చేయించుకోవాలి, స్టిగ్మా ఉండకూడదు, ఎక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి అన్న అవగాహన ప్రజల్లో వచ్చేలా చర్యలు తీసుకోవాలి.

టెస్ట్‌లు స్వచ్చందంగా ఎలా చేయించుకోవాలి, ఒకవేళ పాజిటివ్‌ వస్తే ఏం చేయాలి అన్నదానిపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాల‌ని, 14410, 104 నెంబర్లకు మరింత ప్రచారం కల్పించండి. కరోనా వచ్చినా కంగారు పడొద్దు అనే విధంగా ప్రజల్లో ధైర్యాన్ని కలిగించేలా విస్తృతంగా ప్రచారం చేయండి. ప్రభుత్వం తరపున ఎడ్యుకేట్‌ చేయడం ఒక పని అయితే మరోవైపు తగిన మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేయాలి.

ప్రతీ ఇంటికి విస్తృతంగా ప్రచారం చేయండి, వాలంటీర్ల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. కరోనా లక్షణాలు కనిపిస్తే ఏ విధంగా ముందుకెళ్ళాలి అని ప్రతీ ఇంటికీ తీసుకెళ్ళండి. టీవీ యాడ్స్, న్యూస్‌ పేపర్స్‌ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయండి. ప్రజలకు భరోసా ఇచ్చేలా ప్రచారం ఉండాలి, పాజిటివ్‌ వస్తే తీసుకోవాల్సిన వైద్యం, జాగ్రత్తలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన రావాలి. వచ్చే 2, 3 వారాలు మరింత ముమ్మరంగా ప్రచారం చేయండి.

ఆశా వర్కర్లకు, ఏఎన్‌ఎంలు, వలంటీర్ల సహకారంతో ముందుకెళ్ళండి. అనుమానం ఉండి ఫోన్‌ చేసిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టండి. అంతర్జాతీయ విమానాలు, దేశీయ విమానాల రాకపోకల వివరాలు సీఎం ఆరా తీశారు. గడ‌చిన వారం రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో నమోదయిన కేసుల వివరాల‌తో పాటు పాజిటివిటీ రేట్, మోర్టాలిటీ రేట్, జిల్లాల వారీగా నిర్వహించిన టెస్ట్‌లు, నమోదయిన కేసుల వివరాల‌ను అధికారులు సీఎంకు వెల్ల‌డించారు.

ఏఏ జిల్లాల్లో ఏఏ ప్రాంతాల్లో కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి, జిల్లాల వారీగా హాట్‌స్పాట్‌లు, కేసులు ఎక్కువగా నమోదవడానికి గల కారణాలు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మొత్తం జిల్లాలవారీగా 71 సెంటర్లలో 15,614 బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయన్న అధికారులు ఇప్పటివరకూ 4,54,030 శాంపిల్స్‌కు గాను 4,659 పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు వెల్లడించారు.

అందుబాటులో ఉన్న డాక్టర్లు, ఇతర వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది వివరాలు సీఎం దృష్టికి తీసుకురాగా మోర్టాలిటీ రేట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలలి సీఎం సూచించారు. బోర్డర్స్‌ నుంచి వచ్చే వారు ఎక్కువసేపు వేచి ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వార్డ్, విలేజ్‌ క్లీనిక్స్‌ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. 

ఈ స‌మీక్ష‌లో ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని, చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు.