శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (13:39 IST)

రిక్షావాలాకు ఐటీ శాఖ నోటీసులు.. పాన్ కార్డు కింద రూ.43కోట్ల టర్నోవర్

Rickshaw wala
రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబానికి చెందిన రిక్షావాలాకు ఇటీవల ఆదాయపన్ను శాఖ అధికారులు నోటీసులు పంపించారు. రూ.3.47 కోట్ల రూపాయలను పన్ను రూపంలో చెల్లించాలని నోటీసులు పంపారు. దీంతో పాపం ఆ రిక్షావాలా షాక్ అయ్యాడు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో జరిగింది.
 
జిల్లాలోని బకల్‌పూర్ ప్రాంతానికి చెందిన ప్రతాప్ సింగ్ రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, తన బ్యాంకు ఖాతాకు పాన్ కార్డును జత చేయాలని బ్యాంకు అధికారులు చెప్పగా స్థానికంగా ఉండే జన్ సువిధ కేంద్రంలో పాన్ కార్డుకోసం ధరఖాస్తు చేసుకున్నాడు. కొన్నిరోజులకు ఓ వ్యక్తి వచ్చి కలర్ పాన్ కార్డ్ ఇచ్చి వెళ్లాడు. అయితే, ఆ కార్డు నకిలీ కార్డు అని తెలుసుకోలేకపోయాడు ప్రతాప్ సింగ్‌. 
 
కాగా, అక్టోబర్ 15 వ తేదీన రిక్షావాలాకు ఆదాయపన్ను అధికారులు రూ.3.47 కోట్లు ఆదాయపన్ను చెల్లించాలని నోటీసులు ఇవ్వడంతో షాకైన ప్రతాప్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పాన్ కార్డు పేరు మీద కొంతమంది జీఎస్టీ నెంబర్ తీసుకొని వ్యాపారం చేస్తున్నారని, 2018-19లో అతని పేరుమీదున్న కంపెనీ టర్నోవర్ రూ.43 కోట్లుగా ఉందని అధికారులు గుర్తించారు.