గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 23 మార్చి 2020 (22:11 IST)

పటిష్టంగా లాక్‌డౌన్‌ – అధికారులకు జగన్‌ ఆదేశాలు

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలవుతున్న  తీరుపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్షించారు. వైద్య,ఆరోగ్య, పోలీసు అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. సమావేశంలోని

ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి...
 
1. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, పాజిటివ్‌ కేసుల సంఖ్యపై వివరాలు అందించిన అధికారులు. వారు కోలుకుంటున్న తీరును వివరించారు. 
 
2. కరోనా సోకిన 80.9 శాతం మంది ఐసోలేషన్లోనే ఉంటూ కోలుకుంటున్నారు. 13.8శాతం మంది ఆస్పత్రిలో చేరుతున్నారు. వారిలో 4.7శాతం ఐసీయూలో చికిత్స పొందారు. వీరిని దృష్టిలో ఉంచుకుని అత్యుత్తమ వైద్యం కోసం విశాఖపట్నంలో విమ్స్, విజయవాడ, తిరుపతి, అనంతపురములలో  ఆస్పత్రులు. దాదాపు 1300 బెడ్లు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. గత సమీక్షా సమావేశాల్లో  భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. 
 
3. వెంటనే 150 వెంటిలేటర్స్‌తో ఐసీయూ యూనిట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి తోడు త్వరలో అదనంగా మరో 200 వెంటిలేటర్స్‌తో ఐసీయూ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. 
 
4. ప్రైవేటు ఆస్పత్రుల్లో 450 వెంటిలేటర్స్‌ను సిద్ధంచేసేలా ప్రయత్నాలు ప్రారంభించామన్నారు.
 
5. పైన చెప్పిన నాలుగు ఆస్పత్రుల్లోనే కాకుండా ప్రతి జిల్లా ఆస్పత్రుల్లో 100–200 బెడ్లు సిద్ధంగా ఉంచనున్నారు. దాదాపు 2వేల బెడ్లు సిద్ధంచేస్తున్నారు. కరోనా సోకిన వృద్ధుల ఆరోగ్య పరిస్థితి సంక్షిష్టంగా మారుతున్న సందర్భంలో వారికి మంచి వైద్యం అందించడానికి భాగంగా ఈ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
 
6. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి పౌరుడూ ఇంటికి పరిమితం కావాల్సిన అవసరం ఉంది. ఇలా చేస్తేనే వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. కాని, కొంతమంది దీన్ని పాటించడంలేదన్న అక్కడక్కడా వెలుగుచూసిన ఘటనల దృష్ట్యా సరైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పౌరుల బాధ్యతను గుర్తుచేయాలన్నారు.
 
7. ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప ఎవ్వరూ కూడా ఇళ్లు విడిచి బయటకు రావొద్దని, ఈమేరకు చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశం. తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలన్నారు.
 
8. ఇతర రాష్ట్రాల నుంచి ఏ వాహనాలు కూడా రాకుండా అడ్డుకోవాలని సీఎం స్పష్టంచేశారు. గూడ్సు, నిత్యావసర వస్తువులతో కూడిన వాహనాలు తప్ప ఏవీకూడా తిరగరాదని సీఎం స్పష్టంచేశారు. 
 
9. నిత్యావసర దుకాణాలు తప్ప మిగతావి మూసేయాలి. కనీస అవసరాలు కొనుగోలు చేసేందుకు ప్రతి కుటుంబం నుంచి ఒక్కరిని మాత్రమే అనుమతించాలి. వారిని కూడా 3 కి.మీ పరిధికే పరిమితం చేయాలన్నారు. 
 
10 . ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకున్నప్పుడు ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా వైద్య ఆరోగ్యశాఖ సూచనలు పాటించాలని సీఎం అన్నారు.
 
11. క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో కోవిడ్‌ –19 నివారణ చర్యలపై నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు.

సమీక్షా సమావేశంలో వైద్యఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు చీఫ్‌ సెక్రటరీ పీవీ రమేష్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీఎంసీ ఛైర్మన్‌ సాంబశివారెడ్డి, డీజీపీ గౌతవం సవాంగ్‌ తదితరులు పాల్గొన్నారు.