చంద్రబాబు నివాసం కూల్చివేతకు రంగం సిద్దం!! వారం రోజులే సమయం
రాజకీయ దుమారానికి కారణమైన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం వ్యవహారం మరో సారి తెర మీదకు వచ్చింది. గతంలోనే అక్రమంగా నిర్మించిన ఈ నివాసాన్ని ఎందుకు తొలిగించకూడదంటూ స్థానిక అధికారులు నోటీసులు జారీ చేసారు. అయితే, దీని పైన అన్ని పత్రాలు సమర్పిస్తామని నాడు భవన యజమానులు సమాధానం ఇచ్చారు. వారు కోరిన సమయం ముగిసింది. దీంతో.. మరోసారి సీఆర్డీఏ అధికారులు చంద్రబాబు ఉంటున్న నివాసానికి నోటీసులు అంటించారు.
వారంలోగా ఆయన ఉంటున్న నివాసాన్ని తొలిగించాలని.. లేకుంటే తామే తొలిగిస్తామంటూ సీఆర్డీఏ అధికారులు ఆ ఇంటికి నోటీసులు అంటించారు. ఈ మేరకు భవన యజమాని లింగమనేని రమేష్ పేరుతో అధికారులు నోటీసులు అంటించారు. ఇప్పుడు దీనిపైన ఆ ఇంట్లోనే నివాసం ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా రియాక్ట్ అవుతారా.. తిరిగి ఇది రాజకీయంగా ఎటువంటి టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.