బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 నవంబరు 2021 (13:04 IST)

అర్థరాత్రి హైడ్రామా... తెదేపా నేత కూన రవికుమార్ అరెస్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్థరాత్రి అరెస్టులపర్వం కొనసాగుతోంది. తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల్లో ఒకరైన కూన రవికుమార్‌ను శ్రీకాకుళం పోలీసులు శనివారం రాత్రి అర్థరాత్రి పెద్ద హైడ్రామా మధ్య అరెస్టు చేశారు. 
 
శ్రీకాకుళంలోని రెండో పట్టణ పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రసాదరావును దుర్భాషలాడారన్న అభియోగాలపై ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన తన సోదరుడు నివాసంలో నిద్రిస్తుండగా శనివారం అర్థరాత్రి 12 గంటల మధ్య వెళ్లి ఇంటి తలుపులు బద్ధలుకొట్టి అరెస్టు చేశారు. 
 
ఆ తర్వాత ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, ఇటీవలి కాలంలో ఏపీ పోలీసుల వైఖరి అనేక విమర్శలకు దారితీస్తుంది. అయినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. విపక్షాలకు చెందిన నేతలను ఆర్థరాత్రిపూట ఇంటి తలపులు బద్ధలుకొట్టిమరీ అరెస్టులు చేస్తున్నారు. అలాంటివాటిలో కూన రవికుమార్ అరెస్టు ఒకటి చేరింది.