మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , సోమవారం, 30 ఆగస్టు 2021 (12:12 IST)

పొంగుతున్న కొండ‌వీటి వాగు... స్పందించిన ఇరిగేష‌న్ అధికారులు

గుంటూరు జిల్లా తాడేపల్లిలో కొండవీటి వాగు పొంగుతోంది. ఎగువ నుంచి వాగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తూ ఉండటంతో, తమ పొలాలు ఎక్కడ మునుగుతాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. 
 
ఉండవల్లి, పెనుమాకతోపాటు పలు గ్రామాల రైతులు, కృష్ణా నది దగ్గర ఉన్న కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ఇరిగేషన్ అధికారులకి తమ ఆందోళన తెలిపారు. తమ పైఅధికారులకు తెలిపి, ఇరిగేషన్ ఉన్నత అధికారుల ఆదేశాలతో రెండు మోటార్లు ఆన్ చేసి కృష్ణా నదిలోకి నీటిని ఇరిగేషన్ అధికారులు వ‌దులుతున్నారు.
 
తమ సమస్యని తెలియ చేయగానే, స్పందించి రెండు మోటార్ల ద్వారా నీటిని విడుదల చేసిన ఇరిగేషన్ అధికారులకి  రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయ పాలెం, వెంకట పాలెం గ్రామాల రైతుల‌కు కొండ‌వీటి వాగు వ‌ల్ల ప్ర‌మాదం పొంచి ఉంది.