బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 సెప్టెంబరు 2022 (09:37 IST)

అసెంబ్లీ ఎన్నికలకు ముందే మూడు రాజధానులు.. అమర్‌నాథ్

mla gudivada amarnath
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ  అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించే అవకాశం ఉందని వెల్లడించారు.

వైసీపీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని ఎక్కడా చెప్పలేదని, అయినా 90 శాతానికి పైగా పూర్తి చేశామని అమర్‌నాథ్ అన్నారు. ఎన్నికల్లోపు మిగిలిన వాటిని అమలు చేస్తామని స్పష్టం చేశారు. 
 
టీడీపీ నేతలు చంద్రబాబు, యనమల రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, వారిని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడే చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేశ్‌ను జైలుకు పంపాలని అమర్‌నాథ్ డిమాండ్ చేశారు.

విభజన హామీలను కేంద్రానికి తాకట్టుపెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దంటూ ఆర్‌బీఐకి టీడీపీ నేతలు లేఖలు రాశారని తెలిపారు.