బుధవారం, 29 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 డిశెంబరు 2022 (10:45 IST)

విజయవాడ రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్..ఏంటది..?

train
విజయవాడ రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్. నిమిషాల తలబడి క్యూలో నిలుచుకోకుండా క్యూ ఆర్ కోడ్‌ను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు రైల్వే అధికారులు యూటీఎస్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి విస్తృతంగా ప్రచారం చేశారు. 
 
దీంతో చాలామంది ప్రయాణీకులు దాని ద్వారా టికెట్ తీసుకుంటున్నారు. తద్వారా ప్రయాణీకులకు టిక్కెట్లు తీసుకునే పని సులభం అయ్యింది. 
 
కౌంటర్ల వద్ద నిలిచే ప్రయాణీకుల సంఖ్య తగ్గింది. దీంతో ప్రయాణీకులు స్టేషన్ చేరుకున్నాక యూటీఎస్ ఓపెన్ చేసి అక్కడి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఐదు బుకింగ్ కౌంటర్ల వద్ద ఏర్పాటు చేసిన ఈ క్యూఆర్ కోడ్‌లను దశలవారీగా అన్ని ఫ్లాట్‌ఫామ్లలో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది.