శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 23 నవంబరు 2022 (08:42 IST)

24న దివ్యాంగులు - వృద్ధులకు దర్శన టిక్కెట్లు రిలీజ్

tirumala
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. వృద్ధులు, వికలాంగులకు ఈ నెల 24వ తేదీన దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నట్టు తెలిపింది. ముఖ్యంగా, దివ్యాంగులు, ఐదేళ్లలోపు పిసబిడ్డల తల్లిదండ్రులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీటీడీ ఉచిత ప్రత్యేక దర్శనం కల్పిస్తుంది. దీనికి సంబంధించి దర్శన టిక్కెట్లను విడుదల చేస్తుంది. ఈ టిక్కెట్లను ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు తెలిపింది. 
 
ఈ టిక్కెట్లను టిటిడి అధికారిక వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చని తెలిపింది. నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని స్పష్టం చేసింది. కాగా, ప్రతినెలలోనూ రెండు రోజులు దివ్యాంగులు, ఐదేళ్ల లోపు పసిబిడ్డలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టిటిడీ తిరుమల వెంకన్న దర్శన భాగ్యం కల్పిస్తున్న విషయం తెల్సిందే.