సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (11:58 IST)

ఇంటికే బీరు పంపిస్తాం.. అనుమతి ఇవ్వండి ప్లీజ్

ఇల్లు కాలి ఒకడేడిస్తుంటే... వల్ల కాక మరొకడేడ్చిన సామెతను గుర్తు చేస్తోంది బీరు తయారీదారుల వ్యవహారం. కరోనా నేపథ్యంలో ఏకంగా ఇంటికే బీరు సరఫరా చేస్తామని, అనుమతి ఇవ్వాలని అఖిల భారత బ్రూవరీస్‌ సంఘం (ఎఐబిఎ) ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది.

దీనివల్ల రాష్ట్ర ఖజానాకు కూడా నిధులు సమకూరుతాయని పేర్కొంది. అత్యవసర సేవల్లోకి బీరును తీసుకురావాలన్న కొత్త వాదన తెరపైకి తీసుకురావడం గమనార్హం. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో తమ లేఖకు అక్కడి ప్రభుత్వాలు స్పందించాయని వివరించింది.

లాక్‌డౌన్‌ కారణంగా గత నెల 22వ తేదీ నురచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పూర్తిగా నిషేధించారు. ప్రభుత్వమే నిర్వహిస్తున్న మద్యం దుకాణాలు కూడా మూతపడ్డాయి.

దీంతో బ్లాక్‌లో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. ఐదు రెట్లు ఎక్కువ ధరకు కొన్ని చోట్ల విక్రయాలు జరుగుతున్నాయి. అయితే వేసవి కాలం కావడంతో ఫ్రిజ్‌లో ఉరచలేక బీర్ల అమ్మకాలు మాత్రం బ్లాక్‌లో కూడా జరగడం లేదు.