సీఎం జగన్ అక్రమాస్తుల కేసు.. సీబీఐ కోర్టులో విచారణ వేగవంతం
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు శుక్రవారం సీబీఐ కోర్టులో జరిగింది. ఈ సందర్భంగా డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలను వచ్చే నెల 31వ తేదీకి పూర్తి చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తద్వారా జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సీబీఐ కోర్టులో వేగవంతం అయ్యింది.
జగన్ అక్రమాస్తుల కేసుపై టీడీపీ పలుమార్లు ప్రశ్నించింది. ఇతర కేసుల్లో విచారణ త్వరగా జరుగుతున్నప్పటికీ జగన్ ఆస్తుల కేసులో లేదని ఆరోపణలు చేసింది.
అయితే ఇప్పుడు ఈ కేసులో వేగవంతం అయ్యింది. సీబీఐ ఎనిమిది ఛార్జీషీట్లలో నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ ముగిసింది. మరో మూడు ఛార్జీషీట్లలో డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది.