మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 9 నవంబరు 2021 (14:17 IST)

మోదీజీ! ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తాన‌న్నారు... ఏమైంది?

దేశంలో బీజేపీ అంత ఘోరంగా విఫలమైన ప్రభుత్వం మరోకటి లేద‌ని ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య ఘాటుగా విమ‌ర్శించారు. కడప నగరంలో వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య మీడియాతో మాట్లాడారు. దేశాన్ని బీజేపీ ప్రభుత్వం ఆర్దికంగా కుదేలు చేసింద‌న్నారు. 
 
 
నాడు దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, దేశంలోని నల్లధనం వెలికితీసి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తానని చెప్పిన మాటలను ప్రజలు విశ్వసించార‌ని రామ‌చంద్ర‌య్య చెప్పారు. ఆ దిశగా ప్రయత్నాలు చేశారా? ఆ మొత్తం ఎందుకు దేశ ప్ర‌జ‌ల ఖాతాల్లోకి వెయ్య‌లేక‌పోయార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అన్నాహజారే దీక్ష చేస్తే, లోక్ పాల్ బిల్లును తీసుకోస్తానని చెప్పిన మీరు తీసుకొచ్చారా... రాజ్యాంగ స్పూర్తి అంటే అర్థమేమిట‌ని ప్ర‌శ్నించారు. 
 
 
లక్షల కోట్ల ఆదాయాన్ని ఇచ్చే ఎల్ఐసీ సంస్థను ప్రైవేట్ పరం చేస్తానని చెప్పడం సిగ్గు చేట‌ని,  నిత్యావసర వస్తువుల ధరలను నియత్రించగలిగారా అని ప్ర‌శ్నించారు. బీజేపీ ఇచ్చిన హామీలు అన్ని ఇన్ని కావ‌ని, వాటిలో ఏ ఒక్కటైనా నెరవేర్చారా అని నిల‌దీశారు. పదేళ్ళ పాటు ప్రత్యేక హోదా ఇస్తామని వెంకన్న సాక్షిగా చెప్పి ఆ హామీని తలపైన పెట్టేశార‌ని, ఇక కడప ఉక్కు పరిశ్రమ హామీ ఏమైంద‌ని ప్ర‌శ్నించారు. 157మెడికల్ కళాశాల మంజూరు చేస్తే, ఎపీకి ఓక్క కళాశాల కేటాయించకపోవడం సిగ్గు చేటు అని దుయ్య‌బ‌ట్టారు. 
 
 
కరోనా విపత్కర పరిస్థితుల్లో వలస కూలీలకు రైళ్లు కూడా వేయలేద‌ని, 70ఏళ్ళల్లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేద‌న్నారు. దేశ ప్ర‌జ‌లు కడుపు మంటతో రగిలిపోతుంటే, మతాన్ని ప్రోత్సహిచడమేమిటిట‌ని రామ‌చంద్ర‌య్య నిల‌దీశారు. స్వతంత్ర నిర్ణయాలను తీసుకొని ఫెడరల్ వ్యవస్థ కు శ్రీకారం చుట్టార‌ని, నూతన చట్టాలను తెచ్చి వ్యవసాయ రంగాన్ని నిర్విర్యం చేశార‌ని ఆరోపించారు. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయని కారణంగా స్టీల్ కొర‌త వ‌చ్చింద‌ని, ప్రభుత్వ రంగ సంస్థలైన ఉక్కు కర్మాగారాలను ప్రైవేట్ పరం చేసి నిర్వర్యం చేశార‌ని విమ‌ర్శించారు. కరోనా నుంచి ఇంకా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ప్రజల నడ్డి విరిచిన కేంద్ర ప్రభుత్వంపై ప్ర‌జ‌లు తీవ్ర నిర‌స‌న‌తో ఉన్నార‌న్నారు. 
 
 
రాష్టాలకు ఉనికి లేకుండా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, డీజిల్ ధరలను పెంచిందెంత. తగ్గించిందెంత అని ప్ర‌శ్నిస్తూ, అస‌లు ధరలను, సెస్ ను పెంచి, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి బీజేపీ నేతలకు సిగ్గుండాల‌న్నారు. ఇక్క‌డి జీవన ప్రమాణాలు పెంచలేనప్పుడు రాష్ట్రంలో బీజేపీ ఎందుకు?  జెండాలు పట్టుకోని ప్రజల్లోకి వెళ్ళడానికి మీకు సిగ్గు లేదా అని ప్ర‌శ్నించారు.