శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (16:25 IST)

ముగిసిన ప్రచార సమయం... బుసలు కొడుతున్న నోట్ల 'కట్టలు

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ఘట్టం ముగిసింది. ఆ తర్వాత ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అన్ని పార్టీలు తాయిలాల ప్రలోభాలకు తెరతీశాయి. పోలింగ్‌ సమీపిస్తున్న కొద్దీ.. నోట్ల కట్టల పాములు బయటకు వస్తున్నాయి. మంగళవారం ప్రచారానికి ఆఖరి రోజు, దీంతో ఇప్పటికే చేరుకున్న నగదును ముందే సిద్ధం చేసుకున్న జాబితాల ప్రకారం.. పంపిణీ మొదలైంది. మరికొందరైతే ఫోన్‌ పే, పేటీఎమ్‌లను వాడుతున్నారు. ఈ మొత్తం చిన్నగా ఉండటం అంతా స్నేహితులవడం వల్ల ఇలాంటి చోట పంపిణీ చాలా సులువుగా మారింది.
 
కాగా, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస భారీ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు ఎలాగైనా ఈసారి సత్తా చాటాలని సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో నువ్వా-నేనా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నా యి. మొత్తం 17 నియోజకవర్గాల్లో అన్ని పార్టీల అభ్యర్థుల ఖర్చు అనధికారికంగా రూ.50 నుంచి 60 కోట్లకు పైగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
 
ప్రధానంగా భువనగిరి, నల్లగొండ, సికింద్రాబాద్, మల్కాజిగిరి, ఖమ్మం స్థానాల్లో అభ్యర్థుల ఖర్చు భారీగా ఉంటున్నట్లు సమాచారం. ఒక్కో నియోజకవర్గంలో రూ.150 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన ఐదు నియోజకవర్గాల్లోనే రూ.750 కోట్లు దాటనుంది. మిగిలిన 11 నియోజకవర్గాల్లో రూ.550 నుంచి రూ.660 కోట్ల వరకు ఖర్చు కావచ్చు. ఈ లెక్కన రూ.1,400 కోట్ల వరకు పార్టీలు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.