శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : ఆదివారం, 24 మార్చి 2019 (12:40 IST)

తెలంగాణాలో తుడిసిపెట్టుకున్న తెలుగుదేశం.. లోక్‌సభ ఎన్నికల పోటీకి దూరం

తెలంగాణా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తుడిసిపెట్టుకుని పోతుందని చెప్పొచ్చు. వచ్చే నెల 11వ తేదీన జరుగనున్న లోక్స‌సభ ఎన్నికలకు ఆ పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించింది. కానీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. మరోవైపు.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా... ఈ విషయంపై ఇప్పటికే టీడీపీ నాయకులతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది.
 
కాగా, గత యేడాది డిసెంబరు నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. అయినప్పటికీ తెరాస విజయభేరీని అడ్డుకోలేక పోయాయి. పైగా, ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుపొందారు. వారు కూడా అధికార తెరాసలో చేరిపోయారు. దీంతో తెలంగాణ శాసనసభలో టీడీపీకి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఇపుడు లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆ పార్టీ నిర్ణయించడంతో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.