మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2024 (22:44 IST)

నిజమైన నాయకుడు పవన్ కల్యాణ్ అని చెప్పిన బాబు: జన వాహిని భారీ స్పందన - Video

Chandrababu, Pawan Kalyan
తెలుగుదేశం-జనసేన-భాజపా కూటమి గెలుపే లక్ష్యంగా తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రచారం చేస్తున్నారు. గురువారం నాడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరంలో ఇద్దరు నాయకులు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వీరు నిర్వహించిన రోడ్ షోకి భారీ జనసందోహం హాజరయ్యారు.
 
తొలుత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... నిజమైన నాయకుడు, ఏపీ అభివృద్ధి కోసం విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని వచ్చినవాడు, మీకోసం ఎన్నో కష్టాలను ఓర్చుకుంటున్న నాయకుడు పవన్ కల్యాణ్ అని ప్రశంసించారు. చంద్రబాబు మాటలకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. అంతా ముక్తకంఠంతో అవునూ అంటూ జేజేలు పలికారు.
 
అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... జనసేన పార్టీని వదిలివెళ్తున్న నాయకులను తనేమీ పొమ్మని చెప్పడంలేదని అన్నారు. ఒక్కసారి తను నాయకుడిగా బాధ్యతలు అప్పగించాక వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు. ఐతే నిజమైన జనసేన నాయకులు పదవుల కోసం కాదనీ, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతారన్నారు. అలాంటి జనసైనికులు, వీరమహిళలలు మెండుగా జనసేనలో వున్నారని అన్నారు.