గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2024 (14:37 IST)

హిస్టరీలో ఫస్ట్ టైమ్ :: 151 సీట్లు వచ్చినోడ్ని ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి బిత్తరపోయేలా చేస్తున్నారు..!!

pawan kalyan
చరిత్రలో మొట్టమొదటిసారి ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకోనుంది. గత ఎన్నికల్లో ఏకంగా 151 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని, ఐదేళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయి, కనీసం ఒక్క చోటు కూడా ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి ఇపుడు బిత్తరపోయేలా చేస్తున్నాడు. ఆ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి కాగా, ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్. 
 
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్‌ను ఎలాగైనా ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో అధికార వైకాపా నేతలతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలు ఉన్నారు. ఇందుకోసం ఇంతకాలం కాపు కులానికి పెద్దగా ఉన్న ముద్రగడ పద్మనాభంను వైకాపాలోకి చేర్చుకున్నారు. ఈయన ద్వారా కాపు ఓట్లను గుంపగుత్తంగా వైకాపాకు పడేలా చూసుకుని పవన్‌ను ఓడించాలని వ్యూహం రచించాడు. అది వర్కౌట్ కాలేదు. దీంతో రూ.500 కోట్లు ఓటర్లకు పంచి ఓడించేందుకు ప్లాన్ చేసినట్టు ప్రచారం జరిగింది. 
 
అయితే, పవన్ కళ్యాణ్ పట్ల పిఠాపురం ప్రజలకు ఉన్న అభిమానాన్ని డబ్బుతో కొనుగోలు చేయలేమని కోడి కూయకముందే అర్థమైంది. ఆ తర్వాత మండలానికో మంత్రిని, గ్రామానికో ఓ ఎమ్మెల్యేను ఇన్‌చార్జ్‌లు నియమించారు. కానీ క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న ప్రజా స్పందనను చూసి ఓర్వలేకపోయారు. దీంతో ఇపుడు డమ్మీ ఈవీఎంలను వైకాపా నేతలు నమ్ముకున్నారు. జగన్ స్టిక్కర్లు, ఇతర సామాగ్రి, డమ్మీ ఈవీఎంలను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు గుర్తించి, అందులోని ఈవీఎంలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.