శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2024 (15:02 IST)

అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్!!

mandali - pawan
కృష్ణా జిల్లా అవనిగడ్డ అసెంబ్లీ స్థానం అభ్యర్థిగా ఇటీవల జనసేన పార్టీలో చేరిన మండలి బుద్ధ ప్రసాద్‌ పేరును ఆ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు. ఆయన పార్టీలోని ముఖ్యనేతలతో అనేక దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత మండలి పేరును ఖరారు చేశారు. అలాగే, అనంతపురం జిల్లాలోని రైల్వే కోడూరు అభ్యర్థి మార్పుపై కూడా ఒక నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, పాలకొండ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన అభ్యర్థి పేరుపై మరో రెండు రోజుల్లో ఓ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 
 
పాలకొండ అసెంబ్లీ స్థానానికి సంబంధించి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత హరిప్రసాద్ తెలిపారు. ఇదే అంశంపై పార్టీ నేతలతో చర్చిస్తూ అభిప్రాయసేకరణ చేస్తున్నారని తెలిపారు. రైల్వే కోడూరు అభ్యర్థిగా యనమల భాస్కర రావు పేరును పవన్ ప్రకటించారనీ, అయితే, ఆయన అభ్యర్థిత్వంపై సర్వేల్లో సానుకూలత వ్యక్తం కాలేదని, మిత్రపక్షమైన టీడీపీ నుంచి కూడా అనుకూలత లేదని తెలిపారు. అందుకే అక్కడ అభ్యర్థిని మార్చాలని జనసేన నేతలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. అందువల్ల రైల్వే కోడూరు అభ్యర్థిత్వంపై గురువారం సాయంత్రానికి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. 
 
పుట్టిండో పులి పిల్ల పాలమూరు జిల్లాలోన... సీఎం రేవంత్‌ప కిన్నెర మొగులయ్య పాట... 
 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కిన్నెర వాయిద్యకారుడు, "భీమ్లా నాయక్" గాయకుడు, పద్మశ్రీ కిన్నెర మొగలయ్య కలుసుకున్నారు. సీఎం నివాసంలో ఆయనను కలుసుకున్నారు. మొగులయ్యను ఆయన చిన్న కుమారుడిని మంత్రి కొండా సురేఖ సీఎం నివాసానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్ ముందు మొగులయ్య తన కళను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్‌పై ఓ పాటను కూడా పాడారు. "పుట్టిండో పులి పిల్ల పాలమూరు జిల్లాలోన అచ్చంపేట తాలూకాలోన కొండారెడ్డిపల్లిలోన" అంటూ ఓ పాట పాడారు. మొగులయ్య పాటకు మంత్రముగ్ధుడైన సీఎం రేవంత్ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. 
 
ఆ తర్వా మొగులయ్య వ్యక్తిగత జీవిత అంశాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. నాగర్ కర్నూ్ జిల్లా లింగాల మండలం పరిధిలోని అవుసలి కుంట గ్రామానికి చెందిన మొగులయ్య కిన్నెర వాయిద్యకళాకారుడు. ప్రస్తుతం 12 మెట్ల కిన్నర వాయిద్యాన్ని మాత్రమే వాయించగలరు. కిన్నెర వాయిద్యానికి విశేష గుర్తింపు తీసుకొచ్చినందుకు మొగులయ్యను గత 2022లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం కూడా ఆయనను ఘనంగా సత్కరించి ఆర్థిక సాయం కూడా చేసిన విషయం తెల్సిందే.