సీసపు గోళి గొంతులో ఇరుక్కుపోయింది.. బాలుడి మృతి
మొన్నటికి మొన్న సపోటా పండు ప్రాణాలపైకి వచ్చిన వార్త వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ చిన్నారిని గోళి బలి తీసుకుంది. సీసపు గోళి గొంతులో ఇరుక్కుపోయి ఓ చిన్నారి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన శనివారం జగిత్యాల జిల్లా కోరుట్లలోని పోచమ్మ వీధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కోరుట్ల రవిరాజు మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్నాడు. శనివారం కొడుకు అభియంత్(11 నెలలు) ఇంటి ఆవరణలో పిల్లలతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సీసపు గోళి మింగేశాడు.
అది గొంతులో ఇరుక్కుపోయింది. ఇంకా ఊపిరాడలేదు. వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జగిత్యాల తీసుకువెళ్లారు. అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.