శనివారం, 7 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 జులై 2022 (17:29 IST)

350 ఆవులను కాపాడిన జాలర్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా వెలుగోడు రిజర్వాయర్‌లో కొట్టుకుపోతున్న 350 ఆవులను జాలర్లు రక్షించారు. వెలుగోడు సమీపంలో మేతకు వెళ్లిన 500 ఆవులను సమీప అడవిపందులు వెంటపడి తరిమాయి. దీంతో ఆవులన్ని వెలుగోడు రిజర్వాయర్‌లోకి దిగాయి. 
 
నీటి ప్రవాహానికి ఆవులు కొట్టుకుపోతుండగా గమనించిన గ్రామస్థులు, జాలర్లు 350 ఆవులను రక్షించారు. అయితే మరో 150 ఆవుల కోసం మరబుట్టలతో గాలింపు చర్యలు చేపట్టారు.