గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (09:27 IST)

తిరుపతి జిల్లాలో కలుషిత ఆహారం తిని 50 మందికి అస్వస్థత

తిరుపతి జిల్లాలో కలుషిత ఆహారంతో 50కిపైగా మంది అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం కేబీపురం మండలం ఆరె గ్రామంలోని ఓ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసాదాన్ని నిర్వాహకులు గ్రామస్థులకు పంపిణీ చేశారు. 
 
ప్రసాదం తిన్న గ్రామస్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన వైద్యాధికారులు గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. 
 
కొందరు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 30 మందికిపైగా చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.