గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 15 జులై 2021 (09:02 IST)

576వ రోజుకు అమరావతి రైతుల ఉద్యమం

రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని అమరావతి రైతులు చేస్తోన్న ఉద్యమం గురువారంతో 576వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ, సచివాలయం, రాజ్‌భవన్‌, హైకోర్టు, పరిపాలనా భవనాలు ఉన్న ప్రాంతమే రాష్ట్ర రాజధాని అని తెలిపారు.

అమరావతి రాజధాని కూడా అలాగే ఏర్పాటైందన్నారు. దీనిని మార్చడానికి సీఎం జగన్‌కి ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. అమరావతిని నాశనం చేయటం కోసమే మూడు రాజధానులు అని చెప్పారు. విశాఖ, కర్నూలును రాజధానిగా చేయమని ఐదు కోట్లమందిలో ఒక్కరైనా అడిగారా.. అని ప్రశ్నించారు.

భూములు ఇచ్చిన వారిని రోడ్డుపాలు చేసిన ప్రస్తుత పాలకులపై మోసం కేసు నమోదు చేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తున్నామని తెలిపారు. రాజధాని 29 గ్రామాలలో ఆందోళనలు, అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం మోతడక గ్రామంలో రైతులు, మహిళలు నిరసనలు కొనసాగించారు.